Tuesday, December 05, 2006

కవి(కా)నా ?

ఒక మంచి పుస్తకం ఇంకొక పుస్తకాన్ని చదవడాన్ని ప్రేరేపిస్తుంది.. నేను ప్రస్తుతం శ్రీ శ్రీ ఆత్మ కథ చదువుతున్నాను.. నాకెందుకో కవిత్వం అంటే ఎడతరు(ర)గని ప్రీతి. నా బాల్యపు ఊహాగానాలతో మొదలయ్యి, దిన దిన ప్రవర్ధమానమవ్వుతూ, సకల భాషాలను గెలికి, తెగిన గాలిపటం అయ్యింది నా కవిత్వం. శ్రీ శ్రీ కవితలు మళ్ళీ నన్ను ప్రభావితం చేసాయి. ఆ మాటకొస్తే, శ్రీ శ్రీ ని ప్రభావితం చేసిన కవులు ఎంతోమంది. వాళ్ళందర్లో నాకు నచ్చిన వాళ్ళు, బొత్తిగా తెలియని వాళ్ళు, ఇలా ఎందరో మహానుభావులు. షెల్లీ, కీట్స్, రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్..
ఇటీవల చదువుతున్న ఎమెర్సన్ కవిత్వాన్ని తెలుగులో అనువదించే ప్రయత్నం చేసా.. ఎమెర్సన్ అభిమానులారా! తప్పుగా అర్థం చేసుకోవద్దని నా మనవి.

చావుగురించి భయమెందుకు
నిర్జీవ శరీరం అలా పడెయ్యడమే
వసంత మాసపు పూచులలో
శరీరాన్ని ఆహారంగా
నేల జీవుల పొట్టకొసం
నెలవంక సమాధి సాక్షిగా

ప్రకృతి తాండవంతో
చుట్టుకొన్న పర్వతాలు
కడిగిన సాగరఘోష
నేను చావు కొరుకుంటున్నా,
నా సమాధి పైరగాలితో
వున్న పరిమళం సాక్షిగా
భగవంతుని ఒప్పదంగా

నేను తీపి చావు కొరుకుంటున్నా
పర్వతపుట్టెతంత చిగురాకులతో
సూర్యుణ్ణి వెతుకుతూ
నన్ను గౌరవంగా పరుండబెట్టి
వర్తన అందిన చిరుగాలి శ్రవణానందంగా
భగవంతుని మాఘ వసంతాల ఆజ్ఞ తోడుగా
చివరి గేయాల జ్ఞాపకాలతో
ప్రకృతి చక్రపు గతిలో ఇంకొక నేను..

ఎమెర్సెన్ రాసిన కవితే ఇది.