Monday, May 01, 2006

నా తెలుగు కు తెగలు పట్టిందా ?

శ్రీ దుర్గా మల్లీశ్వర్ల వార్ల దేవత్సానం, విజయవాడ (కనకదుర్గా అమ్మవార్ల గుడి) లో పని చేసె మా మావయ్య కు ఆంగ్ల భాషా పరిజ్ఞానం అంతంత మాత్ర మే అని ఇక్కడ చెప్పుకోవాలి. మన కి తెలుగు యెంత వచ్చో, అయనకు ఆంగ్లం భాశా ప్రావీణ్యం అంతే వచ్చు అన్నమాట. అయన సంస్క్రుతాధ్యయనం చేసిన పండితుడు.

ఇంక అసలు విషయానికి వస్తే, అయన తన సెల్ ఫోను పోగొట్టు కున్నారు. దాన్లో ఆంగ్ల భాష ఉపయోగించి, ఫొన్ జాబితా పొందు పరచుకున్నాడు. ఇప్పుడు నోకియా 6030 ఫోను కొనుకున్నాడు. ఆయన యేది చేసినా విషేశంగా నే వుంటుంది మరి. నోకియా 6030లో ఇప్పుడు పూర్తిగా తెలుగులో నే ఫొన్ జాబితా పొందుపరచుకొన్నాడు.

నా సాఫ్టవేరు బుర్ర తీవ్రంగా పనిచేయ్యడం మొదలు పెట్టింది:
"పరి తే ధన్వ నో హేతి రస్మా న్వ్రుణక్తు విశ్వతః" అని నమకం లో వుంది.
మావయ్య, న్వ్రుణక్తు అని ఎలా నీ సెల్ ఫొన్ లో రాస్తావు చూపించు అన్నా. అయన క్షణం లో చక చక రాసి చూపించాడు. అయినా, న్వ్రుణక్తు అనే పేరు యెవ్వరికన్నా వుంటుందా? నా బుర్రకున్న తెలివికి ఒక పిచ్చి చూపు చుస్తాడేమో అనుకున్నా. అలాంటిది యేవి లేకుండా, ఇలాంటివి చాలా వచ్చు నాకు, అని ఒక విజయ దరహాసం చేసాడు.

నోకియా 6030 తెలుగు పుణ్యమా అని, మా మావయ్య తో సంతోషించా. నా సెల్ పోతే, నేను కూడ తెలుగు సెల్ నే వాడుదాం అని పించింది మరి!!!

2మీ వ్యాఖ్య

Blogger తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

వేంకటమూర్తిగారూ, మీ బ్లాగులో మీరు రాసే విషయాలు చాలా బావున్నాయి. కాని ఏ ఇతర బ్లాగులోను లేనన్ని అక్షర దోషాలున్నాయి. శ్రద్ధ తీసుకోగలరని మనవి.

6:18 AM  
Blogger Sudhakar said...

ఈ బ్లాగు ఏంటో ఇక్కడే ఆగి పోయింది. వారాంతాలు టీవీని సేవించకపోతే కాస్త తెలుగు సేవ చెయ్యొచ్చుకదా...

2:12 AM  

Post a Comment

<< Home