Thursday, November 16, 2006

సంస్కరణ


పదండి ముందుకు,
పదండి త్రొసుకు,
పొదాం, పొదాం, పై పైకి!
కదం త్రొక్కుతు,
పదం పాడుతు,
హ్రుదాంతరాళం ఘర్జిస్తు..


ఇవాళ వచ్చిన వార్త చదువుంతుంటే, నాకు వచ్చిన ఆలోచన - ఈ గేయం.

రాజకీయాలకి సంఘసంస్కరణలకి వున్న పొత్తు నిర్వివాదాంశం. కాకపొతే, సంఘసంస్కరణలు రాజకీయంగా మారినప్పుడు దెబ్బ సంఘానికే గాని, రాజకీయలకు కాదు. నిజమైన సంఘసంస్కరణ, మనలొనే వుంది. మన "హ్రుదాంతరాళం"లో. మన మనుగడకు దారి ఏది అని ఇవాల్టి రాజకీయాలు పెద్ద పెద్ద భాషణలు, సుభాషితాలు, వినిపిస్తాయే తప్ప, ఒక్కరు ముందుకు వచ్చి, ఇది దారి అని చూపించిన దాఖలాలు బాపూజి గారితో మొదలయ్యి, అక్కడ, అక్కడ, మెరుపుల్లాగ ఒకటో, రెండో కనిపిస్తాయి..

గుర్తింపు యెవ్వడి అబ్బ సొమ్ము కాదు.. అది ఫలాన్ని ఆశించకుండా కష్టపడితే వచ్చేది. అలా వచ్చినప్పుడే, పొందే వాళ్ళకు కూడా ఆనందం.

1మీ వ్యాఖ్య

Blogger cbrao said...

ఇదే కాదు లెండి,ఇప్పుడు ఇచ్చే అవార్డులు ఎక్కువ శాతం ఇలాగే ఉన్నై. ఈ బహుమతి ఇస్తే ఆ కులం వాళ్ళు మన పార్టికి అనుకూలంగా ఉంటారనో, ఆ బహుమతి ఇస్తే రాజకీయంగా లాభిస్తోందనో లాంటి కారణాలు పైకి కనిపించవు. అప్పుడప్పుడూ నిజంగా అర్హమైన వారికీ దక్కుతాయి ఈ బహుమతులు. మీ Profile లో మీ పరిచయమే లేదు. రాసి, తెలియపరచండి.

8:32 PM  

Post a Comment

<< Home