Monday, February 13, 2006

ఆటాకుందాం రండి !!!


సుడోకు అనే సరికొత్త క్రీడ అమేరికాలొ పుట్టి, జపాన్ ద్వార ప్రాచుర్యం పొంది, ప్రస్తుతం మన దేశంలోనూ వేగంగా పాకిన విశయం మనందరికి అవగతమే. గణితానికి భారత దేశం ప్రపంచానికి కానుకగా ఇచ్చిన సున్న '0' మాత్రం 'సుడోకు' లో లేదు.

కాబట్టి అంకెలను వదలి అక్ష్రరాలతో 'సుడోకు'ను దేశీయంగా మలచాలని రూపొందిచిందే 'స్వరావళి'. ఆంధ్రభూమి సచిత్ర వార పత్రిక వారం వారం ఈ 'స్వరావళి' నిర్వహిస్తోంది.

సప్తస్వరాలైన 'స రి గ మ ప ద ని స'లను కేళిగా మలుచుకొని సాగే క్రీడ ఇది. 123456789 అనే అంకెల స్థానంలో 'స రి గ మ ప ద ని స' అనే అక్ష్రరాలు ఈ 'స్వరావళి'లో వుంటాయి.



'స్వరావళి' నిభందనలు:

1. ఈ 'స్వరావళి' లో మొత్తం 9 గళ్ళు వుంటాయి. తిరిగి ఒక్కొక్క పెద్ద గడిలో 9 చిన్న గళ్ళున్నయి.
2. ఒక్కొక్క పెద్ద గడిలో 9 చిన్న గళ్ళలో 'స రి గ మ ప ద ని' అనే అక్ష్రరాలు వేయాలి. కేళి అనే రెండక్షరాలు ఎక్కడుంటాయో ఇచ్చి వున్నాయి. అవి కాక ఇప్పుడున్న అక్ష్రరాలు మార్చకూడదు. ఒక సారి వచ్చిన అక్ష్రరం(స్వరం) మళ్లీ రాకూడదు.
3. ఇదే తరహలో పెద్దగళ్ళు తొంమ్మిదింటినీ నింపాలి.
4. ఆ తర్వాత నిలువుగా వున్న 9 చిన్న గళ్ళును అడ్డంగా వున్న 9 చిన్న గళ్ళును చూడండి. నిలువుగా అడ్డంగా అన్ని వరుసలూ చూడండి. ప్రతి వరుసలో ఏదో విధంగా 'సరిగమపదనికేళి' అని అన్ని అక్ష్రరాలూ వుండాలి. ఏ వరుసలో వచ్చిన అక్ష్రరం మళ్ళి రాకూడదు.

స్వరావళి పూరణం, మరిన్ని విశేషాలు తో ఈ సారి మళ్ళీ కలుద్దాం !!!
ఇప్పటికి శెలవు.

సాంకేతిక తంత్ర సభ విశేషాలు

సుస్వాగతం!

మన పూర్వికులు వేద సభలు నిర్వహించి, పండితులని, ఆధర్వయమ్ వహించిన పండితొత్తములనీ యధాశక్తి సన్మానించి సంత్రుప్తి పడేవాళ్ళు. ఇప్పుడు ఈ యాంత్రిక జన జీవన స్రవంతి లొ అలాంటి సదస్సులు జరగడం యెప్పుడో కాని అరుదు.

కాని, వేద సభలు కు ధీటుగా, ఇప్పుడు జరిగేవి సాంకేతిక తంత్ర (సంవిధాన శాస్త్రం) సభలు. పొయిన వారాతం (శనివారం,నలుగవ తారీఖు) అలాంటి ఒక సభ కు మేము ఆధర్వయమ్ వహించి, సభికులందరికి తగు పారితోషకాలు ఇచ్చి, సంత్రుప్తి పరిచాము.

మరిన్ని విశేషాలు త్వరలొ.

మీ,
వేంకట మూర్తి.