Tuesday, December 05, 2006

కవి(కా)నా ?

ఒక మంచి పుస్తకం ఇంకొక పుస్తకాన్ని చదవడాన్ని ప్రేరేపిస్తుంది.. నేను ప్రస్తుతం శ్రీ శ్రీ ఆత్మ కథ చదువుతున్నాను.. నాకెందుకో కవిత్వం అంటే ఎడతరు(ర)గని ప్రీతి. నా బాల్యపు ఊహాగానాలతో మొదలయ్యి, దిన దిన ప్రవర్ధమానమవ్వుతూ, సకల భాషాలను గెలికి, తెగిన గాలిపటం అయ్యింది నా కవిత్వం. శ్రీ శ్రీ కవితలు మళ్ళీ నన్ను ప్రభావితం చేసాయి. ఆ మాటకొస్తే, శ్రీ శ్రీ ని ప్రభావితం చేసిన కవులు ఎంతోమంది. వాళ్ళందర్లో నాకు నచ్చిన వాళ్ళు, బొత్తిగా తెలియని వాళ్ళు, ఇలా ఎందరో మహానుభావులు. షెల్లీ, కీట్స్, రాల్ఫ్ వాల్డో ఎమెర్సన్..
ఇటీవల చదువుతున్న ఎమెర్సన్ కవిత్వాన్ని తెలుగులో అనువదించే ప్రయత్నం చేసా.. ఎమెర్సన్ అభిమానులారా! తప్పుగా అర్థం చేసుకోవద్దని నా మనవి.

చావుగురించి భయమెందుకు
నిర్జీవ శరీరం అలా పడెయ్యడమే
వసంత మాసపు పూచులలో
శరీరాన్ని ఆహారంగా
నేల జీవుల పొట్టకొసం
నెలవంక సమాధి సాక్షిగా

ప్రకృతి తాండవంతో
చుట్టుకొన్న పర్వతాలు
కడిగిన సాగరఘోష
నేను చావు కొరుకుంటున్నా,
నా సమాధి పైరగాలితో
వున్న పరిమళం సాక్షిగా
భగవంతుని ఒప్పదంగా

నేను తీపి చావు కొరుకుంటున్నా
పర్వతపుట్టెతంత చిగురాకులతో
సూర్యుణ్ణి వెతుకుతూ
నన్ను గౌరవంగా పరుండబెట్టి
వర్తన అందిన చిరుగాలి శ్రవణానందంగా
భగవంతుని మాఘ వసంతాల ఆజ్ఞ తోడుగా
చివరి గేయాల జ్ఞాపకాలతో
ప్రకృతి చక్రపు గతిలో ఇంకొక నేను..

ఎమెర్సెన్ రాసిన కవితే ఇది.

Friday, November 24, 2006

వుద్యోగాన్వేషన

నేను శోధించె స్వగతాలు లొ శ్రీరాం క్రిష్నన్ ది ఒకటి. ఆ వ్యాసనా శైలి, విషేషాలు చెప్పే రీతి, నాకు నచ్చింది. నేనూ తనలాగే కలన యంత్రంతో పొట్ట కూటికోసం యెడ తెరిపి లేకుండా శ్రమించే ఒక వ్యక్తి..
ఇంత ఉపొద్ఘాతం యెందుకు అనుకుంటున్నారా... సరే మరి. అసలు విషయానికి వద్దాం...

తను గత కాలం లో వ్రాసిన ఒక స్వగతం నాన్ను ఆలోచింప చెసింది.. తను ఆ స్వగతం లో వుద్యోగుల అన్వేషన కోసం వచ్చే సంస్థలు గురించి, వుద్యోగం కోసం ఆ సంస్థలు పెట్టే "బాధలు" (ఇక్కడ నేను తను చెప్పే విధానం లో, "బాధలు" అనే అంటున్నాను..) గురించి వ్రాశారు. అవి నిజంగా "బాధలా"? ఒక సంస్థ లో పనిచేసే వుద్యోగుల పనితనం నిర్ణయించే హక్కు ఆ సంస్థ కి వుందా? ఖచ్చితంగా వుంది. యెందుకంటే, నేను ఇప్పటిదాక చాలా చాలా (కొన్ని వందల) వ్యక్తుల్ని, సాంకేతిక ముఖా ముఖి ద్వార వాళ్లని అంచనా వేసే ప్రయత్నం చెస్తుంటా. ఆ సరిలో కొంతమంది వుద్యొగార్థులు నేను పని చేసే సంస్థ లో చేరడం.. వాళ్లతో కలిసి పని చేయడం జరుగుతాయి.. కాని అందరికి సంస్థ వుద్యోగం ఇవ్వలేదు కదా? ఇస్తే "నిరుద్యొగం" అనే పదాలికి అర్థం వుండదుకుంటా..
ఈ వ్యాసం వుద్యోగార్ధుల అపొహలు, ప్రశ్నలిని విశదీకరించే ఒక చిన్న ప్రయత్నం.
==============================================
ముందుగా వుద్యోగార్థులికి వ్రాత పరీక్ష వుంటుంది... ఇలా పెట్టడం, ప్రశ్నపత్రాలని దిద్దడం, యెంత కష్టమో దిద్దేవాళ్ళకే తెలుస్తుంది.. నాకైతే, ఆ ప్రశ్నపత్రాలు దిద్దే మూడు ఘంటలు ఒక యుగం లా గడుస్తుంది.. యెక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే, ఒక మంచి వుద్యోగార్థిని పొగొట్టుకొవాలి.. అంతేకాదు; ప్రశ్నపత్రాలు దిద్దే వాళ్ల వుద్యోగాలు కూడ వూడతాయి ఒక చిన్న పొరపాటు జరిగితే.. ఇంక స్థలాభావానికి వస్తే, కొన్ని వందలసంఖ్యలో వచ్చే అభ్యర్థులికి, సంస్థ గురించి వివరించే అవకాశం వచ్చినప్పుడు ఆ కళాశాల అంత మందికి కూర్చునే చొటు కూడ కలిపించలేక పొవడం తప్పు.. అది వుద్యోగ సంస్థల తప్పు అవుతుందా? పొయిన నెలలో నేను వెళ్లిన ఒక కళాశాల మాకు సరిగ్గా భొజనం కూడ పెట్టలేదు. అలా అని అత్త మీద కొపం గిత్త మీద చూపెట్టలేము కదా? కాలే కడుపుతో ఓపికగా వుద్యొగార్థుల సాంకేతికపట్టు పరీక్షించాలిసి వచ్చింది.

ఇక్కడ ఒక ముఖ్యమైన అపోహ గురించి వివరిస్తాను: వుద్యొగార్థుల సాంకేతికపట్టు పరీక్షించాలిసి వచ్చినప్పుడు నాకు చాల ముఖ్యమైన, వచ్చిన అభ్యర్థి గురించి అవగాహన కలిగించేది - వాళ్ళ సంక్షేప జ్ఞానం గురించి వివరించే కాగితాలు. కొంత మంది వాటిల్లొ మాకు పాడడం, నాట్యం చెయడం ఒక సరదా అని పెద్ద పెద్ద అక్షరాలలో కళ్ళకు కట్టేటట్టు వ్రాస్తారు.. పొనిలే సరదా కోసమనో, లేకపొతే ఈ వుద్యోగ అవకాశం మళ్ళీ తొందరలోనే రాదు-వచ్చినప్పుడే వినియోగించుకొవాలి అనో, మాలాంటి పరీక్షకులని ఆకట్టుకొవాలనో రాసారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని సాంకేతిక ప్రశ్నలు అడిగితే, షరా మామూలే. సార్, మాకు పాడడం, మాట్లాడడం ఒక ముఖ్యమైన సరదా అని చెప్తారు. సరే బాబు, నీకు పాడడం ఒక ముఖ్యమైన సరదా అయితే, నాకోసం ఒక పాట పాడరాదు అని అడిగేలా చేస్తారు. పాడిన తర్వాత బయట స్నేహితులతో, ఉరే, వాడెవడో నా చేత పాట పాడించుకున్నాడు. అసలు ఈ సంస్థకు వుద్యోగులు అక్ఖర్లేదు.. అవకాశాలు లేవు.. ఊరికనే మనల్ని చంపుతున్నారు అని చెప్తారు. నాకు జరిగిన ఒక సంఘటన ఇక్కడ చెప్పాలి.. నేను సాధారణంగా నుదుట బొట్టు లేనిదే బయటకు కదలను. రోజు మొక్కుబడిగా చేసే ప్రార్థనలో భాగంగా బొట్టు పెట్టుకొవడం అలవాటు. ఇలానే ఒక కలాశాలకు వెళ్ళడం తటస్థిచింది. అందులో మామూలుగా వ్రాత పరీక్షలో నెగ్గిన అభ్యర్థులకు సాంకేతిక ముఖాముఖి జరుగుతోంది. నా దెగ్గరకు వచ్చిన ఒక సగటు అభ్యర్థి కూడా నాలాగే నుదుట బొట్టు పెట్టుకున్నాడు. హమ్మయ్య, ఇతను నా సాంకేతిక ప్రశ్నలకి జవాబు ఇస్తే బాగుణ్ణు అని అనుకున్నా(నా దెగ్గరకి వచ్చే ప్రతి అభ్యర్థిని ఇలాగే అనుకుంటా). తను ప్రారంభిచడమే నేను చాల దైవ భక్తి ఉన్న వాడిని సార్ అన్నాడు. నేను అవాక్కయ్యా.. తను వచ్చింది సాంకేతిక ముఖాముఖి కోసమా లేక దైవ భక్తి పరీక్షించుకొవడానికా అని అనుకున్నా.. సరేలే మంచిదనుకొని సాంకేతిక ప్రశ్నలు వెయ్యడం మొదలెట్టా. ఉహు.. షరా మాములే !! విసుగెత్తి, సరే బాబూ అంత సరదాపడుతున్నావు ఏది ఒక చిన్న శ్లోకం చెప్పు అని రుద్రం లో "ఇషు మద్భ్యో ధన్వా విభ్యశ్చ వో నమో నమో ఆ తన్వా నేభ్య ప్రతి దధా నే భ్యశ్చ వో నమో నమో.." అని అందిచ్చా. బాగనే చెప్పాడు కాని, అతన్ని నేను సాంకేతిక ముఖాముఖిలో తిరస్కరించా.. ఇంక బయటకు వెళ్ళిన తర్వాత తను ఏ కథలు అల్లాడో, నాకు తెలీదు.. ఒకవేళ మీరే కనక నాస్థానం లో వుంటే, అతన్ని అంగేకరించేవారా?
ఉపసంహరణ:
=======
ఒక చెయ్యి తో చప్పట్లు రావు అన్న ఛలోక్తి ప్రకారం, అవతల అభ్యర్థినిబట్టే, ఇవతల ప్రశ్నలుంటాయి. అవతల కష్టాల్నిబట్టే, ఇవతల సుఖాలుంటాయి. అభ్యర్థులారా, యెవరో చేసిన తప్పుకి, సంస్థని నిందించడం న్యాయం కాదు. మీరందరూ ఒకప్పుడు నాలాగే వుద్యొగంకొసం పరితపించుపోతున్నారు అని పరిక్షకులకి తెలుసు. మీకు వుద్యొగం ఎంత అవసరమో సంస్థకు మీరంతే అవసరం. ఆ తొందరలో తప్పులు సహజమే.. కాని, వాటిని ఒకసారి ఆత్మావలొకిస్తే బాగుంటుంది..

Tuesday, November 21, 2006

స్వాతంత్ర్య(తత్వపు) పెనుగులాట

అమేరికా అధ్యక్షుడి సుడిగాలి పర్యటనలో భాగంగా, మొన్న తన సైనికులతో కలిసి భొజనం చేసారు. చేసి, బ్రేవ్ అని త్రేంచి, అయన అన్న మాటలలో రెండు ముక్కలు ఇక్కడ రాస్తున్నాను..
"స్వాతంత్ర్యం ప్రేమించే వాళ్ళకు, ప్రేమించని వాళ్ళకు మధ్య జరిగే తత్వపు పెనుగులాట లో, మీరు ఈ భొజనం వడ్డించారు....నా నిశ్చయం మీ నిశ్చయంలాగే స్వాతంత్ర్యం గెలుస్తుంది అని బలపడి వుంది.."

యెంత శోచనీయం!! యెవరికోసం ఈ పెనుగులాట? మీ స్వాతంత్ర్యపు నిశ్చయాల మధ్య ఎవరు నలిగిపొతున్నారో ఒక్క సారి వెనక్కు తిరిగి చూడండి గురుగారు... అన్నెం పున్నెం ఎరుగని చిన్నరులా? అబలలా? వృద్ధులా? చదివేస్తే వున్న మతి కాస్త పొయిందిట. ఒక్క సద్దాం ని ఉరి తీస్తె, మిగితా వాళ్ళు ఎమవ్వాలి?

మన దేశం ప్రగతి రథం. పొరుగు దేశపు ప్రగతి వికాసం యెప్పుడో అయ్యింది.. ఇలాంటి వికాసాలు వద్దు.. మన ప్రగతి రథమే బాగుంది.

మీరూ అంగీకరిస్తారు కదూ?

Thursday, November 16, 2006

సంస్కరణ


పదండి ముందుకు,
పదండి త్రొసుకు,
పొదాం, పొదాం, పై పైకి!
కదం త్రొక్కుతు,
పదం పాడుతు,
హ్రుదాంతరాళం ఘర్జిస్తు..


ఇవాళ వచ్చిన వార్త చదువుంతుంటే, నాకు వచ్చిన ఆలోచన - ఈ గేయం.

రాజకీయాలకి సంఘసంస్కరణలకి వున్న పొత్తు నిర్వివాదాంశం. కాకపొతే, సంఘసంస్కరణలు రాజకీయంగా మారినప్పుడు దెబ్బ సంఘానికే గాని, రాజకీయలకు కాదు. నిజమైన సంఘసంస్కరణ, మనలొనే వుంది. మన "హ్రుదాంతరాళం"లో. మన మనుగడకు దారి ఏది అని ఇవాల్టి రాజకీయాలు పెద్ద పెద్ద భాషణలు, సుభాషితాలు, వినిపిస్తాయే తప్ప, ఒక్కరు ముందుకు వచ్చి, ఇది దారి అని చూపించిన దాఖలాలు బాపూజి గారితో మొదలయ్యి, అక్కడ, అక్కడ, మెరుపుల్లాగ ఒకటో, రెండో కనిపిస్తాయి..

గుర్తింపు యెవ్వడి అబ్బ సొమ్ము కాదు.. అది ఫలాన్ని ఆశించకుండా కష్టపడితే వచ్చేది. అలా వచ్చినప్పుడే, పొందే వాళ్ళకు కూడా ఆనందం.

Monday, October 30, 2006

మీకు తెలుసా?

ప్రపంచవ్యప్తంగా మాట్లాడే భాషలలో తెలుగుది పదిహేనవ స్థానం. మరిన్ని వివరాలకు ఇక్కడ సందర్శించండి.
తెలుగు భాషాభిమానులు, ప్రొత్సాహకులు అందరికి ఇవే నా శుభాకాంక్షలు.

Tuesday, October 03, 2006

తెలుగు ప్రోత్సాహం


మీబో తెలుగు లో యెలా వుంటుందో సమీక్షించా.. కానీ, యాహూ ఐడి ఆగ్లం లో వుంది.. ఇది మీబో వాళ్లనో లేక ఇంకొకరెవరినో తప్పు పట్టడం కాదు.. మన తెలుగు ప్రోత్సాహానికి ఇది ఒక ఉదాహరణ అనగలమా?

Monday, May 01, 2006

నా తెలుగు కు తెగలు పట్టిందా ?

శ్రీ దుర్గా మల్లీశ్వర్ల వార్ల దేవత్సానం, విజయవాడ (కనకదుర్గా అమ్మవార్ల గుడి) లో పని చేసె మా మావయ్య కు ఆంగ్ల భాషా పరిజ్ఞానం అంతంత మాత్ర మే అని ఇక్కడ చెప్పుకోవాలి. మన కి తెలుగు యెంత వచ్చో, అయనకు ఆంగ్లం భాశా ప్రావీణ్యం అంతే వచ్చు అన్నమాట. అయన సంస్క్రుతాధ్యయనం చేసిన పండితుడు.

ఇంక అసలు విషయానికి వస్తే, అయన తన సెల్ ఫోను పోగొట్టు కున్నారు. దాన్లో ఆంగ్ల భాష ఉపయోగించి, ఫొన్ జాబితా పొందు పరచుకున్నాడు. ఇప్పుడు నోకియా 6030 ఫోను కొనుకున్నాడు. ఆయన యేది చేసినా విషేశంగా నే వుంటుంది మరి. నోకియా 6030లో ఇప్పుడు పూర్తిగా తెలుగులో నే ఫొన్ జాబితా పొందుపరచుకొన్నాడు.

నా సాఫ్టవేరు బుర్ర తీవ్రంగా పనిచేయ్యడం మొదలు పెట్టింది:
"పరి తే ధన్వ నో హేతి రస్మా న్వ్రుణక్తు విశ్వతః" అని నమకం లో వుంది.
మావయ్య, న్వ్రుణక్తు అని ఎలా నీ సెల్ ఫొన్ లో రాస్తావు చూపించు అన్నా. అయన క్షణం లో చక చక రాసి చూపించాడు. అయినా, న్వ్రుణక్తు అనే పేరు యెవ్వరికన్నా వుంటుందా? నా బుర్రకున్న తెలివికి ఒక పిచ్చి చూపు చుస్తాడేమో అనుకున్నా. అలాంటిది యేవి లేకుండా, ఇలాంటివి చాలా వచ్చు నాకు, అని ఒక విజయ దరహాసం చేసాడు.

నోకియా 6030 తెలుగు పుణ్యమా అని, మా మావయ్య తో సంతోషించా. నా సెల్ పోతే, నేను కూడ తెలుగు సెల్ నే వాడుదాం అని పించింది మరి!!!